కేజీబీవీ లో కష్టాలు.. కనీస వసతులు పట్టని అధికారులు..

by Shyam |   ( Updated:2021-11-04 05:05:51.0  )
కేజీబీవీ లో కష్టాలు.. కనీస వసతులు పట్టని అధికారులు..
X

దిశ, అచ్చంపేట : కరోనా ఉదృతి తగ్గడంతో గత నెల 21 నుంచి ఆఫ్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. జిల్లాలోని పదర మండలానికి చెందిన కస్తూర్బా గాంధీ పాఠశాల, అమ్రాబాద్ మండలంలోని మన్న నూరు గ్రామములో కొనసాగుతోంది. ఇక్కడ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకూ 215 మంది విద్యార్థినిలు చదువుకుంటున్నారు.

రెండే మరుగుదొడ్లు.. కాలకృత్యాలు ఎలా ?

అమ్రాబాద్ మండల పరిధి మన్ననూర్ గ్రామంలో తుల కస్తూర్బా గాంధీ పాఠశాల లో 215 మంది విద్యార్థులు ఉండగా, కేవలం రెండు మరుగుదొడ్లు ఉన్నాయి. కరోనా రాకముందు ఈ పాఠశాల విద్యార్థులు కనీస కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. దాంతో ఏదో కంటితుడుపు చర్యలు మాదిరిగా రెండు బాత్రూంలు, రెండు టాయిలెట్స్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు.

తాత్కాలికంగా మార్చే అవకాశం ఉన్నా..

ఈ కస్తూర్బా గాంధీ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణ పనులు అమ్రాబాద్ మండల పరిధిలోని తెలుగు పల్లి గ్రామంలో జరుగుతున్నాయి. భవనం పూర్తి అయ్యేవరకు అమ్రాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉందని ఆ భవనంలోకి విద్యార్థులను తరలించారు. అయితే వసతులు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. 23/03/2021 న అప్పటి కలెక్టర్ సూచన మేరకు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ఐటీడీఏ పీవో కు అమ్రాబాద్ లో గల కళాశాల హాస్టల్ భవనాన్ని కేటాయించాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసినా ఇంత వరకూ పట్టించుకున్న నాథుడే లేడు.

స్పందించకపోతే పాదయాత్ర చేపడతాం..
మన్న నూరు గ్రామంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థుల మౌలిక వసతుల పై అధికారులు స్పందించకపోతే బాలల హక్కుల పరిరక్షణ వేదిక తరఫున పాదయాత్ర చేపడతామని జిల్లా కన్వీనర్ బియ్యాన్ని వెంకటేష్ తెలిపారు. విద్యార్థులకు బందులు కొనకుండా అమ్రాబాద్ మండల కేంద్రంలో గల కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story