- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైట్ కర్ఫ్యూ మాత్రమే సరిపోదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను సూమొటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు రాజకీయ సభలు, సమావేశాలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని సూచించింది. కేవలం నైట్ కర్ఫ్యూతోనే కట్టడి చేయలేమని, పగటి సమయాల్లో జనం రద్దీని నివారించడానికి చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతీరోజు హెల్ప్ లైన్ నెంబర్లకు వస్తున్న కాల్స్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల రిపోర్టులను 24 గంటల వ్యవధిలోనే అందించాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ డిస్టెన్స్ నిబంధన పాటించనందుకు నెల రోజుల వ్యవధిలో పోలీసులు కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదు చేయడం విచిత్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించింది.
రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఆదేశించింది. అవసరాన్ని బట్టి వాయుసేన విమానాలను ఆక్సిజన్ రవాణా కోసం మరింత విస్తృతంగా వినియోగించాలని ఆదేశించింది.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులకు అనుగుణంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్, రెమిడిసివిర్ లాంటి మందులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. కరోనా సమయంలో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వీధుల్లో బతుకుతున్నవారని నైట్ షెల్టర్లకు తరలించి సకల సౌకర్యాలను కల్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది.