- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతిని కేంద్రం గమనిస్తోంది
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అవినీతిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీజేపీ నూతన పదాధికారుల తొలి సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్… పార్టీ నియమ నిబంధనలను నేతలు విధిగా పాటించాలని కోరారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రమ శిక్షణతో ఉండాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు. పార్టీలో అనుభవం కలిగిన నేతలు ఉన్నారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
కీలక నిర్ణయాలు
బండి సంజయ్ అధ్యక్షతన ఆదివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ, దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికపై చర్చించారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించిన నేతలు… తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.