టెన్త్ విద్యార్ధుల మార్కులపై విద్యాశాఖ కీలక నిర్ణయం..

by Shyam |
టెన్త్ విద్యార్ధుల మార్కులపై విద్యాశాఖ కీలక నిర్ణయం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎఫ్‌ఏ1 (ఫార్మెటివ్​అసెస్‌మెంట్) మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్లకు గ్రేడ్లను ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాల్ టికెట్లతో పాటు మార్కుల లిస్టులను రెడీ చేస్తోంది. మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను కరోనా విజృంభణ కారణంగా ప్రభుత్వం రద్దు చేసింది. మార్కుల కేటాయింపు విషయంలో బోర్డు తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. ప్రత్యేక అబ్జెక్టివ్​ విధానంలో మార్కులు కేటాయిస్తుందని.. ఈ విధానాన్ని నిర్ణయించే బాధ్యతను బోర్డుకు అప్పగించింది. కానీ అబ్జెక్టివ్ విధానం కంటే విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల ఆధారంగానే గ్రేడ్లు కేటాయించాలని ఎస్ఎస్‌సీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed