- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిత్రుడి కోసం.. రగ్బీ లెజెండ్ కెవిన్ పరుగు
దిశ, వెబ్‌డెస్క్: రగ్బీ లెజెండ్ కెవిన్ సిన్‌ఫీల్డ్ ఏడు రోజులుగా ఏడు మారథాన్లలో పార్టిసిపేట్ చేసి, 12 కోట్లకు పైగా విరాళాలు సేకరించాడు. తన స్నేహితుడు, తోటి రగ్బీ ప్లేయర్ ‘రాబ్ బరో’ గతేడాది ‘మోటర్ న్యూరాన్ డిసీజ్’(ఎమ్ఎన్‌డీ) బారిన పడ్డాడు. దాంతో అతడు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. తన మిత్రుడ్ని అలా చూసి చలించిపోయిన కెవిన్.. ఎమ్ఎన్‌డీ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కెవిన్ సిన్‌ఫీల్డ్, రాబ్ బరోలు ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్ రగ్బీ జట్లకు కలిసి ఆడటంతో పాటు ‘లీడ్స్ రైనోస్’ జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. దురదృష్టవశాత్తు రాబ్ బరో గతేడాది ఎమ్ఎన్‌డీతో ఆటకు దూరమయ్యాడు. మైదానంలో చిరుతలా పరుగెత్తుతూ, చురుకైన కదలికలతో రగ్బీలో తనకు సహకారం అందించిన తన మిత్రుడు రాబ్ బరోను వీల్ చెయిర్‌లో చూడటంతో కెవిన్ తట్టుకోలేకపోయాడు. ఎమ్ఎన్‌డీకి చికిత్స లేకపోవడంతో కెవిన్ మరింత కుంగిపోయాడు. దాంతో తన మిత్రుడిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఎమ్ఎన్‌డీతో బాధపడుతున్న ఎంతోమందికి సాయం అందించాలనే సంకల్పంతో కెవిన్ మారథాన్‌లో పార్టిసిపేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నాడు.
‘నేను వారం రోజులుగా వివిధ మారథాన్స్‌లో పార్టిసిపేట్ చేశాను. నాకు అందరినుంచి మద్దతు లభించడంతో పాటు ఎంతోమంది అభిమానులు నన్ను అభినందిస్తూ మెసేజ్‌లు పెడుడుతున్నారు, విరాళాలు అందిస్తున్నారు. రాబ్ కోసమే ఇదంతా చేసినా, అందరికీ ఈ సాయం ఉపయోగపడుతుంది. మీరందరూ ఇచ్చిన సపోర్ట్‌కు ధన్యావాదాలు. ఇక్కడితో నా ఫండ్ రైజింగ్ కంప్లీట్ కాలేదు. రాబోయే రోజుల్లో ‘ఐస్ బాత్’ చేయబోతున్నాను’ అని కెవిన్ తెలిపాడు. సేకరించిన విరాళాలను ఎమ్ఎన్‌డీ(Motor Neurone Disease) అసోసియేషన్‌కు అందిస్తున్నాడు.