చించేస్తాం… పొడిచేస్తాం…

by srinivas |
చించేస్తాం… పొడిచేస్తాం…
X

దిశ, అమరావతి బ్యూరో: అధికారంలోకి వస్తే చించేస్తాం.. పొడిచేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభివృద్ధిని రివర్స్ గేర్లో తీసుకువెళ్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలసి 3వ డివిజన్ లో పర్యటించారు. పలువురు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ స్మార్ట్ వాటర్ డ్రైనేజీ కోసం 2015లోనే అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యతో మాట్లాడి మూడు రోజుల్లోనే రూ. 450 కోట్లు మంజూరు చేయించామన్నారు. యుద్ధ ప్రాతిపదికన విజయవాడలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనకబడిన విజయవాడను బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనక దుర్గ ఫ్లై ఓవర్, అంతర్జాతీయ విమానాశ్రయంతో అభివృద్దికి పునాదులు వేశామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ కోసం కక్కుర్తి పడి రివర్స్ టెండరింగ్ పేరుతో అడ్డుకుంటోoదని మండిపడ్డారు.

Advertisement

Next Story