మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసిన ‘బుల్లెట్ బండి’.. వారికి అరుదైన గౌరవం

by Shyam |   ( Updated:2021-08-25 06:24:16.0  )
bullet-bandi
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన బుల్లెట్ బండి పాటను రాసిన లక్ష్మణ్, సింగర్ రామ్‌ను కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంలో పుట్టి పెరిగినా.. పాటలపై ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి గొప్పపేరు సంపాదించడమే కాక మండలానికి మంచిపేరు తీసుకొచ్చిన అన్నదమ్ములకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాండ్ర శ్రావణ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, వర్కాల లక్ష్మీ నారాయణ గౌడ్, గండ్ర జగదీశ్వర్ గౌడ్, వేణుగోపాలాచారి, మధుసూదన్ రెడ్డి, జమాల్ ఖాన్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story