- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమానవీయ ఘటన.. 27 రోజుల పసికందును దారుణంగా చంపిన తల్లి
దిశ,వెబ్ డెస్క్: నెలలు నిండని శిశువు క్రమం తప్పకుండా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆ శిశువు ఎడతెగని ఏడుపు 21 ఏళ్ల తన తల్లి నేరం చేయడానికి కారణమైంది. ఈ ఘటన డిసెంబర్ 9న కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది. 27 రోజుల పసికందు తలను గోడకు కొట్టి చంపినందుకు ఆమెను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,, ఆ రోజు ఉదయం 11 గంటలకు చిన్నారిని పతనంతిట్టలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులు ఇచ్చిన మందులతో తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. తదనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది.
ఈ నేపథ్యంలో ఆమె బిడ్డ ఏడ్పుతో విసుగుచెంది కోపంతో ఆ శిశువు తలను గోడకేసి కొట్టి చంపింది. ఆ తర్వాత, మహిళ తండ్రి జోజీ థామస్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.డిసెంబరు 10న పోస్ట్‌మార్టం తర్వాత, పోలీసు అధికారి సర్జన్‌తో మాట్లాడిగా,, పిల్లవాడి తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పాడు. తదుపరి విచారణ చేపట్టిన పోలీసులకు బిడ్డను తల్లే హత్య చేసిందని తేలడంతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొట్టాయంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆమె చదువుతుంది. అనారోగ్యంతో ఉన్న పసికందు తన తదుపరి చదువుకు హాని కలిగిస్తుందని ఆమె బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.