- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం
దిశ, వెబ్‌డెస్క్: 50వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. సూరజ్ వెంజరమూడు ఉత్తమ నటుడి(ఆండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25, వికృతి)గా అవార్డు అందుకున్నారు. కని కస్తూరి ఉత్తమ నటి(బిరియాని)గా కేరళ స్టేట్ అవార్డుతో సత్కరించబడ్డారు. రహ్మాన్ బ్రదర్స్ డైరెక్షన్‌లో సిజు విల్సన్ నిర్మించిన ‘వాసంతి’ బెస్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకోగా..‘కుంబలంగి నైట్స్’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా సుశిన్ శ్యామ్ అవార్డు అందుకున్నారు. లిజో జోస్ పెల్లిస్సెరి(జల్లికట్లు) బెస్ట్ డైరెక్టర్‌గా, రతీశ్ బాలకృష్ణన్(ఆండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25) బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా పురస్కారం అందుకున్నారు. బెస్ట్ సపోర్ట్ యాక్టర్‌గా ఫాహద్ ఫాజిల్, బెస్ట్ సపోర్ట్ యాక్ట్రెస్‌గా శ్వాసిక అవార్డులతో సత్కరించబడగా..నివిన్ పౌలీ, అన్నాబెన్, ప్రియంవద కృష్ణన్ స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు.
అన్నాబెన్ థాంక్స్ నోట్…
ఈ సందర్భంగా అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది అన్నాబెన్. తొలిరోజు నుంచి ప్రేమ, మద్దతు అందిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె… మీరు లేనిదే ఇది సాధ్యం కాదని చెప్పింది. ఏడాది క్రితం వరకు ఇలాంటి పురస్కారం అందుకుంటానని అనుకోలేదని.. సినిమా కోసం హార్ట్ అండ్ సోల్‌తో పనిచేసిన తనను గుర్తించినందుకు కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. హెలెన్, కుంబలంగి మూవీ టీమ్స్‌కు థాంక్స్ చెప్పిన అన్నా బెన్.. ఎల్లప్పుడూ తన వెంట ఉన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పింది.
https://www.instagram.com/p/CKqHr9BJiY8/?utm_source=ig_web_copy_link