విమాన ప్రమాదం.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..

by Anukaran |
విమాన ప్రమాదం.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. మొదట ఫైలెట్ మాత్రమే మృతిచెందాగా.. ఆ తర్వాత కో- ఫైలెట్ తోపాటు ప్రయాణికులు వరసగా మరణిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు 13 మంది మృతి చెందారు. విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 123 మంది గాయపడ్డారు. వీరిలో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. విమానంలో 174 మంది ప్రయానికులు వారిలో 10 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. 0495-2376901, 056 5463903, 054 3090572 నంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కాగా కోజికోడ్ విమాన ప్రమాదంపై పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కేరళ సీఎంకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story