- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్యూట్ కేరళ పోలీస్.. మనసులు గెలిచిన వీడియో
దిశ, ఫీచర్స్: కేరళ పోలీస్ చేసిన మంచి పనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. హృదయాన్ని హత్తుకునే ఆ వీడియో చూసిన నెటిజన్లు సదరు పోలీస్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. విషయానికొస్తే.. ఇటీవల కేరళలోని కాయంకులం సిటీకి చెందిన దంపతులు పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగొస్తున్నారు. కాయంకులం సిటీకి రీచ్ అయ్యే క్రమంలో వారి వెహికల్ అదుపు తప్పి ఓ ట్రక్కును ఢీకొట్టింది. దంపతులకు తీవ్ర గాయాలు కాగా, వారి ఏడు నెలల చిన్నారి క్షేమంగా బయటపడింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ అందించారు. అయితే ఆ చిన్నారి మాత్రం తల్లిని విడిచి ఉండలేక గుక్కపట్టి ఏడుస్తుండటంతో.. అక్కడే డ్యూటీ చేస్తున్న కేఎస్ సురేశ్ అనే పోలీస్ కానిస్టేబుల్ తనను ఎత్తుకుని లాలించి ఎట్టకేలకు నిద్రపోయేలా చేశాడు. ఆ బేబీ తల్లిదండ్రులు తిరిగి వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. కాగా కానిస్టేబుల్ ఆ చిన్నారిని లాలిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సురేశ్‌ను ఉద్దేశించి నెటిజన్లు.. ‘మంచి మనసున్న ఖాకీ, సెల్యూట్ టు కాప్’ అని కామెంట్లు చేస్తున్నారు.