- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరాడంబరంగా కేరళ సీఎం కుమార్తె వివాహం
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. తిరువనంతపురంలోని సీఎం అధికారిక నివాసంలో విజయన్ కూతురు టి. వీణాను సీపీఎం యువజన విభాగం డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్ పెళ్లాడారు. రియాజ్ ఐటీ నిపుణుడు. సీపీఎం కేరళ రాష్ట్ర కమిటీలో సభ్యుడు కూడా. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిష్టర్ మ్యారేజ్‌తో వీణా, రియాజ్ ఒక్కటయ్యారు.
కొవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రి ఈపీ జయరాజన్, సీపీఎం సీనియర్ నాయకులు, వధూవరుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రియాజ్ తల్లిదండ్రులు వివాహానికి హాజరుకాలేదు.
కొవిడ్-19 ఆంక్షల ప్రకారం ఒక దగ్గర సమూహంగా చేరడానికి అనుమతిలేదు. తిరువనంతపురం నుంచి 380 కి.మీ.ల దూరంలోని కొజికొడ్‌లో రియాజ్ తల్లిదండ్రులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహానికి దూరంగా ఉన్నట్లు తెలిసింది.