- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీకి ప్రత్యామ్నాయం ఆయనే : మనీష్ సిసోడియా
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వానికి మధ్య సరికొత్త వివాదం రాజుకుంది. దేశరాజధాని భూభాగానికి సంబంధించిన సవరణ బిల్లు-2021 పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఢిల్లీ మీద విశిష్ట అధికారాలు లెఫ్టెనెంట్ గవర్నర్‌కే ఉంటాయి కానీ, ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉండదనేది ఈ సవరణ బిల్లు సారాంశం.
కాగా, NCTA(నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్-2021)బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడంపై ఆప్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినంగా సీఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఢిల్లీ ప్రభుత్వ పనితీరుతో కేంద్రం ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అవుతోందన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎలాగైనా మోడీని అదుపుచేయాలని, ఢిల్లీ టెరిటరీ బిల్లు ముందుకు వెళ్లకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ప్రధాని మోడీకి కేజ్రీవాలే ప్రత్యామ్నాయంగా నిలుస్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.