‘పెళ్లి’ వార్తలపై క్లారిటీనిచ్చిన కీర్తి సురేశ్

by Jakkula Samataha |
‘పెళ్లి’ వార్తలపై క్లారిటీనిచ్చిన కీర్తి సురేశ్
X

దిశ, సినిమా : ‘మహానటి’తో నేషనల్ అవార్డ్ పొందిన కీర్తిసురేశ్ ‘రంగ్ దే’ హిట్‌ను ఎంజాయ్ చేస్తోంది. హీరో నితిన్, మూవీ యూనిట్ సభ్యులతో కలిసి ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తోంది. ఈ క్రమంలో తన మ్యారేజ్ విషయమై వచ్చిన వార్తలపై ఈ క్యూట్ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనకు ఇప్పటికే రెండు మూడు సార్లు మ్యారేజ్ చేసేశారని, అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని స్పష్టం చేసింది.

కొద్దిరోజుల కిందట కీర్తిసురేశ్.. ఓ బీజేపీ లీడర్ కుమారుడి‌తో మ్యారేజ్ చేసుకోబోతుందని, ఇందుకు అమ్మానాన్న ఒత్తిడి చేస్తున్నారని న్యూస్ స్ప్రెడ్ అయింది. కానీ అవేవీ నిజం కాలేదు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కీర్తి ప్రేమలో పడిందని.. పెద్దలు సైతం అంగీకరించారనే వార్తలొచ్చాయి. ఈ విషయాలను కీర్తి మదర్, సీనియర్ హీరోయిన్ మేనక కూడా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి కూడా ఈ రూమర్లపై స్పందించింది.

‘రంగ్ దే’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి వార్తలపై వచ్చే రూమర్స్ నమ్మొద్దని చెప్పడంతో పాటు తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో? తెలిపింది. అతడికి హ్యుమానిటీ ఉంటే చాలని పేర్కొన్న భామ.. పెళ్లి పీటలెక్కడానికి ఇంకా చాలా టైమ్ ఉందని వెల్లడించింది. కాగా ప్రస్తుతం కీర్తి.. రజనీకాంత్ ‘అన్నాత్తె’, మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’, మోహన్ లాల్ ‘మరక్కార్ అరబికదలింటే సింహం’, డైరెక్టర్ సెల్వరాఘవన్ హీరోగా నటిస్తున్న ‘సాని కాయిదం’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖీ’ త్వరలో విడుదల కానుంది.

Advertisement

Next Story