‘మిస్ ఇండియా’ అంటే ఓ బ్రాండ్ : కీర్తి

by Shyam |
‘మిస్ ఇండియా’ అంటే ఓ బ్రాండ్ : కీర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: బబ్లీ బ్యూటీ కీర్తీ సురేష్ త్వరలో ‘మిస్ ఇండియా’గా తెరపై సందడి చేయనున్న విషయం తెలిసిందే. నరేంద్రనాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో చిన్నప్పటి నుంచి బిజినెస్‌ఉమెన్‌గా ఎదగాలన్న లక్ష్యంతో ముందడుగు వేసే కీర్తి.. విదేశాల్లో ‘ఇండియన్ చాయ్’ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో అదే రంగంలో ఉన్న బిజినెస్ టైకూన్స్‌‌ను తను ఎలా ఎదిరించింది. అవరోధాలన్నింటినీ తట్టుకుని ఎలా ఇండియన్ చాయ్ బిజినెస్‌కు బ్రాండ్‌గా నిలిచింది అన్నదే ఈ కథ. కాగా ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ను చాటేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇక ట్రైలర్‌లో భాగంగా ‘బిజినెస్ అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆట కాదు.. బిజినెస్ ఒక యుద్ధం, నిజానికి చాలా దూరంగా.. అబద్ధానికి చాలా దగ్గరగా బతుకుతున్నావు’ వంటి డైలాగ్‌లతో పాటు చివర్లో కీర్తి చెప్పే ‘మిస్ ఇండియా’ అంటే నేను కాదు, ఇదో బ్రాండ్’ అన్న డైలాగ్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నవంబర్ 4న ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, నవీన్ చంద్ర, కమల్ కామరాజ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రస్తుతం కీర్తి నటిస్తున్న ‘సర్కారు వారి పాట’తో పాటు ‘రంగ్‌దే’ చిత్రం సెట్స్‌పై ఉండగా.. ‘గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే కావడం విశేషం.

https://www.instagram.com/p/CGt1zzrp8YK/

Advertisement

Next Story