దళిత బంధుకు కేసీఆర్ సతీమణి ప్రోత్సాహం

by Anukaran |   ( Updated:2021-08-16 05:20:12.0  )
దళిత బంధుకు కేసీఆర్ సతీమణి ప్రోత్సాహం
X

దిశ, వెబ్‌డెస్క్: దళిత బంధు పథకం కేవలం హుజురాబాద్‌ ఉప ఎన్నిక వరకు మాత్రమే కాదని.. శాలపల్లి బహిరంగ సభతో ముగియదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చర్చలు జరిపి భారీగా దళిత సభలు నిర్వహిస్తామన్నారు. దళిత సంఘాలు, దళిత ఉద్యోగులు, దళిత రచయితలు, దళిత మేథావులతో సుధీర్ఘ చర్చలు చేసి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం హుజురాబాద్ సభ సాక్షిగా 15 మందికి దళితు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దళిత వాడల్లో దళిత బంధు పండుగలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి ముందు కూడా తన భార్యను అడిగే తెలంగాణ కోసం పోరాడానని.. ప్రస్తుతం దళితుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెబితే.. అందుకు తన సతీమణి కూడా పోరాటం చేయాలని.. విజయం సాధిస్తామని కూడా సూచించినట్టు కొత్త విషయం చెప్పారు కేసీఆర్.

Advertisement

Next Story