- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘రైతును రాజు చేయడమే కేసీఆర్ ఆశయం’
దిశ, మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయడమే కేసీఆర్ ఆశయమని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు ప్రగతి పథంలో నడుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, రుణాలు చెల్లించకపోతే అవమానాలకు గురిచేశారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం రుణాలు మాఫీ చేసి రైతులకు రుణ భారాన్ని తగ్గించిందన్నారు. రైతులు డీసీసీబీ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఎంపీపీ ఒలం చంద్రమోహన్, మార్నేనేనీ రవీందర్, మర్రి రంగారావు, మర్రి నారయణ రావు, రంజిత్, రెడ్డి, రవీందర్ రెడ్డి, గుగులోత్ వీరు నాయక్, డీసీసీబీ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.