కరోనా కంటే కేసీఆరే ప్రమాదం..

by Shyam |

దిశ, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎంత ప్రమాదమో ప్రజలందరినీ ఉక్కపాదంతో అణచివేస్తున్న సీఎం కేసీఆర్ అంతే ప్రమాదమని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరకు సుధాకర్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రాల తో తొక్కించిన చంద్రబాబు కన్నా కేసీఆర్ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థులపై ఉక్కుపాదం, ఆశ వర్కర్ల పై దాడులతో టీఆర్ఎస్ పాలన ప్రహసనంలా మారిందన్నారు. కేసీఆర్, కేటీఆర్ కొన్న భూముల కంటె పెద్ద కుట్ర ఉంటాదా అని ప్రశ్నించారు. రేవంత్ పై బూ దందాలు పై చర్యలు తీసుకుంటెకే ఒకే.. కానీ తప్పుడు కేసులు పెట్టడం సరికాదు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎం మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదన్నారు. కాంగ్రెస్ కుమ్ములాటలతో ఆ పార్టీతో పాటు తెలంగాణ పరువు కూడా పోతోందని విమర్శంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని ప్రకటించడాన్ని ఇంటి పార్టీ స్వాగతిస్తోందన్నారు. తెలంగాణలో కరోనా రాదని సీఎం అనటం సరికాదన్నారు. సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున కరోన వార్డ్ గా చేయాలని డిమాండ్ చేశారు. కేవలం డ్రోన్ వాడినందున ఓఎంపీని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో మొదటి సారి అని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే సీఎం కాదని నిధుల విషయంలో కేంద్రంతో చట్ట బద్ధంగా పోరాడాలన్నారు. అరెస్ట్ చేసిన కాశీం, నలమాస కృష్ణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఈ సమావేశంలో ఇంటి పార్టీ నేతలు దేవేందర్ రెడ్డి, కృష్ణ, గౌస్, కృష్ణ మాదిగ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Tags: telangana enti prarty president, pressmeet, KCR risk than corona

Advertisement

Next Story