- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులతో కేసీఆర్ సమీక్ష.. వారిని క్షమించేది లేదు
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా జిల్లాల్లో పర్యటనలు చేస్తూ.. పలు భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గడంతో పలు కార్యక్రమాలపై కేసీఆర్ దృష్టిసారించారు. అందులో భాగంగానే శనివారం కలెక్టర్లు, అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి, హరితహారంపై సమీక్ష నిర్వహించారు.
జూలై 1వ తేదీ నుంచి పల్లెప్రగతి, పట్టప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన ఏ పని కూడా.. పెండింగ్‌లో ఉండేందుకే వీల్లేదని హెచ్చరించారు. గ్రామాల్లో డోర్ టూ డోర్ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని అధికారులకు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తుందని సీఎం తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 250 ఎకరాల్లో ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలని.. అదనపు రైస్ మిల్లుల అవసరం ఉందని అన్నారు. కల్తీ విత్తనాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలు అమ్ముతున్న వారిపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.