- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొంగరిగిద్ద కు కేటీఆర్ వరం.. వెంటనే స్పందించాలని ట్వీట్..
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లోని కొంగరిగిద్ద ప్రాథమిక పాఠశాల భవనం పై పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారింది. గూడూరు మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో కొంగరిగిద్ద గ్రామం ఉంది. అది పూర్తిగా వెనుకబడిన ఏజన్సీ గ్రామం కావడంతో అక్కడ ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఏ సమయంలో పెచ్చులూడి ఎవరి మీద పడుతుందో అని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంభయంగా గడుపుతున్నారు
గతంలో పాఠశాల భవనం పై పెచ్చులూడి పడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.
విషయం తెలుసుకొని స్పందించిన మంత్రి కేటీఆర్
కొంగరిగిద్ద ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థులకు గాయాలు అవుతున్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ను పాఠశాలను సందర్శించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. కేటీఆర్ స్పందించి పాఠశాలను బాగు చేయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.