రైస్ మిల్లర్లతో కేసీఆర్ సమావేశం

by Shyam |
రైస్ మిల్లర్లతో కేసీఆర్ సమావేశం
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఈసారి వరి పంట విస్తారంగా చేతికొచ్చినందున రైస్ మిల్లర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. రైసు మిల్లుల సామర్థ్యం, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై సీఎం చర్చించారు. వరిసాగు పెరుగుతున్న నేపథ్యంలో ధాన్యం, బియ్యం మార్కెటింగ్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రగతి భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో మిల్లర్లతో పాటు రాష్ట్ర మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 1.04 కోట్ల టన్నుల వరి పంట సాగైందని ముఖ్యమంత్రే ఇటీవల పేర్కొన్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం వరకు సుమారు 40.39 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో 38.44 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే మిల్లులకు తరలించినట్లు వివరించారు. మిల్లుల్లో హమాలీల కొరత తీవ్రంగా ఉన్నందున బీహార్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ప్రభుత్వం మిల్లుల అవసరాలకు అనుగుణంగా వారిని ఎనిమిది జిల్లాలకు తరలించింది. ఇప్పుడు ఆ మిల్లుల సామర్థ్యం, పంట ఎక్కువగా వచ్చినందున భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం గురించి మిల్లర్లతోనే సీఎం చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed