నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం.. వాటిపై చర్చ

by Shyam |   ( Updated:2021-11-20 01:37:45.0  )
telangana smart cities warangal karimnagar
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తవడంతో సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే 12 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావాహులు సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ ఇప్పటికే చాలా మంది నాయకులకు ఎమ్మెల్సీలు ఇస్తానని హామీలిచ్చారు. దీంతో పాత వారికి అవకాశం దక్కుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రులతో చర్చించి అభ్యర్థులను ఫిక్స్ చేసేందుకు ప్రగతి భవన్‌లో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 23న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఈరోజే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధిష్టానం ఎవరెవరికి అవకాశం ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed