‘ప్రైవేట్​సంస్థలకో రూల్.. గురుకులాలకో రూలా?’

by Shyam |
Unemployed JAC chairman Bhimrao Naik
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువును దూరం చేయాలని చూస్తోందని, ప్రైవేట్​సంస్థలకు లేని కొవిడ్.. ప్రభుత్వ హాస్టళ్లు తెరిస్తే వచ్చిందా అని నిరుద్యోగ జేఏసీ విద్యార్థి చైర్మన్ భీంరావు నాయక్​ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వ హాస్టళ్లను వెంటనే తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్​ ప్రైవేట్​సంస్థలకు అనుమతులిచ్చింది ఫీజులు దండుకోవడానికేనని, యాజమాన్యాలు తల్లిదండ్రుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. సంపన్నుల పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే పేదవారి పిల్లలు గొర్లు, బర్లు కాచేందుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులంతా కలిసి మంత్రులకు, మండలాలు, జిల్లాలవారీగా ఎంఈవోలు, డీఈవోలకు వినతిపత్రాలు అందించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed