- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సూపర్ ‘స్కెచ్’.. డిఫెన్స్‌లో మరోసారి ఈటల
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత హుజురాబాద్‌లో రాజకీయ సమీకరణాలే కాదు.. ఇతరాత్ర అన్ని వ్యవహారాల్లోనూ పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈటల మార్క్ లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ నాయకులను పార్టీకి విధేయులుగా ఉంచేందుకు ఎత్తుగడలు వేయడమే కాదు.. వరాలు కూడా ప్రకటిస్తున్నారు.
ఇప్పుడు కేటాయించనున్న నిధులతో ఏయే అభివృద్ది పనులు చేపట్టాలో ప్రతిపాదనలు పంపించాలని సూచిస్తున్నారు. హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాలకు నియమించిన ఇంఛార్జీలు వీటిని సేకరించి మంత్రి గంగుల కమలాకర్‌కు పంపించాల్సి ఉంది. ఒక్కో గ్రామానికి రూ. 30 లక్షలు, మున్సిపాలిటీల్లో అయితే వార్డుకు రూ. 30 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రపోజల్స్ సిద్దం చేస్తున్నారు.
డార్క్‌లోకి పంపించేందుకేనా..?
ఈటల రాజేందర్‌ను డార్క్‌లోకి పంపించేందుకే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. పొలిటికల్ సినారియోనే కాకుండా ప్రజల్లో కూడా టీఆర్ఎస్ పటిష్టంగా నిలిచిపోవాలన్న తాపత్రయంతో ఎత్తుగడలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్లాన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. హుజురాబాద్ అంతటా కూడా ఈటల ప్రభావం అన్నదే లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది.
సైకలాజికల్ వార్..
రాష్ట్ర ప్రభుత్వం ఈటలే లక్ష్యంగా వేస్తున్న వ్యూహాలతో సైకలాజికల్ వార్‌గా మారింది. హుజురాబాద్ కేంద్రీకృతంగా చేపట్టిన సమీకరణాలతో రాజేందర్ మానసికంగా వెనకడుగు వేయాలన్న ఎత్తుగడ దాగి ఉంది. ఆయనను మానసికంగా దెబ్బతీస్తే సక్సెస్ అవుతామన్నదే అధినేత ప్లాన్. దీనివల్ల ఉప ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలే వచ్చినా తాను గెలుస్తానా లేదా అన్న మీమాంసలో ఈటల రాజేందర్ కొట్టుమిట్టాడే అవకాశాలు ఉంటాయని, దీనివల్ల ఆయన ప్రజా క్షేత్రంలో ఓట్ల అభ్యర్థించేందుకు వెళ్లినప్పుడు తప్పటడుగులు వేస్తారన్నదే అసలు వ్యూహమని తెలుస్తోంది.