- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కేసీఆర్ పోతే పీసీఆర్ ముఖ్యమంత్రి ఐతడు.. ఆగమాగం కావొద్దు’
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఏ పథకం ప్రారంభించిన ప్రతిపక్షాల అపోహలు, అనుమానాలే అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా కిరికిరి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లోని శాలపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో లేని ఎన్నో స్కీములు, ఇండియాలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో తీసుకొచ్చామన్నారు. మనసున్న ప్రభుత్వాలు ఉంటే పేదలకు అన్ని కార్యక్రమాలు జరుతున్నాయన్నారు. కానీ, ప్రతిపక్షాలు అనుమానాలు, అపోహలు లేకుండా.. మానవనీయ కోణంలో ఆలోచించాలని కౌంటర్ వేశారు. రాజకీయాలు సహజమని.. కేసీఆర్ పోతే.. మరో పీసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని.. కానీ, తాను పెట్టిన పథకాలను ఎవరూ కూడా తీసివేయలేరని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావొద్దని.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story