ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు, విలువైన కార్ల పంపిణీ ఎందుకు?

by Shyam |   ( Updated:2021-06-19 04:25:10.0  )
ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు,  విలువైన కార్ల పంపిణీ ఎందుకు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాడు ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్.. నేడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి దుయ్యబట్టారు. తెలంగాణ భూముల అమ్మకం పై ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని మంగళవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలన్నారు. ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏందని ప్రశ్నించారు.

అప్పుల పాలు చేసినం తెలంగాణ రాష్ట్రాన్ని… అని సీఎం ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రజలు ఉద్యమాలకు తప్పక సమాయత్తమవుతారన్నారు. ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు, ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృథా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సెక్రెటేరియట్‌కే రాని సీఎంకు కొత్త భవనాలెందుకు? అని దుయ్యబట్టారు. ఇప్పటికైన ప్రభుత్వ భూముల అమ్మకం నిలిపివేసి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed