స్పెషల్ ఫ్లైట్‌లో ఫ్యామిలీతో తమిళనాడుకు కేసీఆర్.. ఎందుకో తెలుసా.?

by Shyam |
స్పెషల్ ఫ్లైట్‌లో ఫ్యామిలీతో తమిళనాడుకు కేసీఆర్.. ఎందుకో తెలుసా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడుకు బయలుదేరారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయాన్ని దర్శించుకోడానికి బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో సోమవారం ఉదయం 12.30 గంటలకు బయలుదేరి వెళ్ళారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు కేటీఆర్, ఆయన భార్య, ఆయన కుమారుడు, కుమార్తె, తదితరులు మొత్తం 12 మంది ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కూడా వీరితో పాటు వెళ్తున్నారు. శ్రీరంగనాధస్వామి ఆలయంలో కేసీఆర్ తన భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

మధ్యాహ్నం దర్శనం అనంతరం ఆయన కొద్దిసేపు అక్కడి ప్రైవేటు హోటల్‌లో బస చేయనున్నారు. ఆ తర్వాత పలువురిని ఆయన కలుసుకుని సాయంత్రానికి చెన్నై నగరానికి విమానంలో బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం అవకాశాన్ని బట్టి తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అవుతారు. అధికార, అనధికార చర్చలు జరపనున్నారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా స్టాలిన్‌తో చర్చించే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed