‘స్పెషల్ డే’ను మిస్సయిన కేసీఆర్ దంపతులు

by Sridhar Babu |
cm kcr couple
X

దిశ, కరీంనగర్ : ఐదు దశాబ్దాల కిందట వివాహం చేసుకున్న వారిద్దరికీ అత్యంత ప్రత్యేకమైన రోజు ఇది. కానీ, అనివార్య కారణాల వల్ల వారిద్దరూ కలువలేకపోయారు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఆ దంపతులిద్దరూ పెళ్లిరోజు వేడుకను జరుపుకోలేకపోయారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శోభమ్మల వివాహం 1969 ఏప్రిల్ 23న వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగింది. 52వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం దంపతులు ప్రత్యేక పూజలు, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఐసోలేషన్‌లో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed