- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ రంగులు మార్చే ఊసరవెల్లి: విజయశాంతి
దిశ,తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా మారిందని విమర్శించారు. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్(ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టే 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ (Food Corporation Of India) తీసుకుంటామని ప్రకటించిందని, మిగిలిన బియ్యాన్ని ‘రా’ రైస్ రూపంలో మాత్రమే ఇవ్వాలని సూచించిందన్నారు. ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదని, ఇది రైస్‌మిల్లర్లకు సంబంధించిన విషయమని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మే లో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టం చేశారని గుర్తుచేశారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అయ్యాయని కేంద్రానికి వివరించారని పేర్కోన్నారు. ప్రస్తుతం ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్ రైస్ తీసుకోవాలని, రానున్న రోజుల్లో ఎఫ్‌సీఐ(Food Corporation Of India)కి బాయిల్డ్ రైస్ అసలు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పాత కోటాకు(24.75 లక్షల టన్నులు) మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను అదనంగా ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తామని స్పష్టంగా ఒప్పందం చేసుకొన్న కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో మతి భ్రమించి ధర్నా పేరుతో రాదంతం సృష్టిస్తున్నాడని, కేసీఆర్కపట నాటకాలను ప్రజలు గమనించి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని విజయశాంతి ప్రజలను కోరారు.