సీఎం పదవికి కేసీఆర్ అనర్హుడు : ఎంపీ అర్వింద్

by Shyam |
సీఎం పదవికి కేసీఆర్ అనర్హుడు : ఎంపీ అర్వింద్
X

దిశ, నిజామాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి పదవికి సీఎం కేసీఆర్ అనర్హుడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. అదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఎవరికి ఏ పోర్డు ఫోలియో ఉందో కూడా మంత్రులకు తెలియదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రికి వ్యవసాయంపై అవగాహన లేదని, తన శాఖలు కానీ వాటిలో కూడా మంత్రి కేటీఆర్ తలదూర్చుతున్నాడన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ప్రారంభించాల్సిన రంగనాయక్ సాగర్‌ను కేటీఆర్ ప్రారంభించడం దురదృష్టకరం అని అన్నారు. కేంద్రం అడిగినన్ని నిధులు ఇస్తున్న ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టడం లేదన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయని, స్టోరేజ్‌లు నిర్మించుకున్నామని చెప్పే ముఖ్యమంత్రికి గన్నీ బ్యాగులు, సుత్తిలీలు, తాటి పత్రిలు ఇవ్వకపోవడం విడ్డురం అని ఎద్దేవ చేశారు.ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఏర్పాట్లు శూన్యమని, ధాన్యంలో కోత, తరుగు పేరుతో కోటా విధించటం అన్యాయమన్నారు. కమీషన్ల కోసమే సీఎం, మంత్రులు పని చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.ఇతర రాష్ట్రాల వలస కూలీల కోసం కేంద్రం ఇచ్చిన రూ.599 కోట్ల నిధులు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.వెంటిలేటర్ల కోసం కేంద్రం డబ్బులు ఇస్తానన్నా, కేసీఆర్ స్పందించడం లేదన్నారు. కావున కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పేదలకు 12 కిలోల బియ్యం, నగదు ఇస్తున్నానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని రకాల నిధులు కలిపి రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.7వేల కోట్లు విడుదల చేసినా, తమకు ఏమీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

tags : nizamabad mp arvind, kcr not suit for cm candidate, kcr cheating farmers

Advertisement

Next Story