- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బల్కంపేట ఎల్లమ్మకు KCR బర్త్ డే స్పెషల్ గిఫ్ట్..
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 17న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి రెండున్నర కిలోల బంగారు చీరను సమర్పించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం పుట్టిన రోజుకు సంబంధించిన ఏర్పాట్లపై మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 17న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, 9 గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షుహోమం, అన్నప్రసాద పంపిణీ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కోటి కుంకుమార్చన, 17న నవగ్రహ, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కోటి కుంకుమార్చనలో పాల్గొన్న 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు అరుణ గౌడ్, శేషుకుమారి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ట్రస్టీ సాయినాథ్ గౌడ్, ఈఓ అన్నపూర్ణ, ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, సికింద్రాబాద్ గణేష్ ఆలయ ఈఓ అంజనాదేవి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ పాల్గొన్నారు.