- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ లాటరీ.. ఓపెన్ చేస్తే డబ్బులు మాయం
దిశ, సినిమా: ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షోను ఒక టూల్‌గా వాడుకుంటున్నారు స్కామర్స్. వాట్సాప్‌లో స్పామ్ మెసేజ్‌లు పంపిస్తూ బ్యాంక్ ఎకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఈ స్కామ్ గురించి ట్విట్టర్ వేదికగా నెటిజన్లను అలర్ట్ చేసిన వెస్ట్ జైంతియా పోలీసులు.. ఇంటర్నేషనల్ నంబర్స్‌తో వాట్సాప్, టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌లపై క్లిక్ చేయరాదని సూచించారు. ఇంట్లో కూర్చునే ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షోలో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, కోటీశ్వరులుగా ఎలా మారిపోవచ్చు? అనే టైటిల్‌తో కేబీసీ లాటరీ మెసేజ్ సర్క్యులేట్ అవుతుండగా.. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మీ ఎకౌంట్లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ కేబీసీ లాటరీ కొట్టేయాలంటే ముందుగా కొంత ఎమౌంట్ పే చేయాల్సి ఉంటుందని మోసగాళ్లు ట్రిక్స్ మొదలుపెడతారని, ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయాలని, తమ మెసేజ్‌లకు రెస్పాండ్ కావాలని కోరతారని తెలిపారు. అలాంటి అపరిచితులతో కమ్యూనికేషన్ డెవలప్ చేయడాన్ని ఆపేయాలన్న పోలీసులు.. ఎదుటివారి గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియకుండా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు.