క్యాచ్ మిస్.. సాంగ్ సెలక్ట్ చేసిన మాజీ క్రికెటర్లు

by Shyam |   ( Updated:2023-10-12 06:16:38.0  )
క్యాచ్ మిస్.. సాంగ్ సెలక్ట్ చేసిన మాజీ క్రికెటర్లు
X

దిశ, సినిమా : కౌన్ బనేగా కరోడ్‌పతి 13 సీజన్ నుంచి సోని ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ తాజాగా కొత్త ప్రోమోను రిలీజ్ చేసింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు మొదటిసారి సెలబ్రిటీ గెస్ట్స్‌గా మాజీ ఇండియన్ క్రికెటర్స్ సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యారు. ప్రోమో మొదట్లో బిగ్ బీ.. ఆన్ ఫీల్డ్‌లో పాటలు పాడే అలవాటు గురించి సెహ్వాగ్‌ను ప్రశ్నించడంతో పాటు క్యాచ్ మిస్ చేసిన సిచ్యువేషన్‌కు ఏ సాంగ్ సూట్ అవుతుందని అడిగాడు. ఇక మాజీ టీమిండియా కోచ్ గ్రెగ్ చాపెల్‌తో గంగూలీకి మధ్య ప్రచారంలో ఉన్న వివాదాన్ని సెహ్వాగ్ ప్రస్తావిస్తూ దాదాను ఆటపట్టించాడు. చాపెల్ కోచ్‌గా ఉన్నప్పటి సిచ్యువేషన్‌కు ‘అప్నీ తో జైసే తైసే కట్ జాయేగీ (మేము ఏదోవిధంగా మేనేజ్ చేస్తాం) సాంగ్ మ్యాచ్ అవుతుందని వెల్లడించాడు. అదే పాటను కంటిన్యూ చేస్తూ ‘ఆప్‌కా క్యా హోగా జనాబ్-ఏ- అలీ(కానీ మీరేం చేస్తారు సార్)’ అంటూ గంగూలీని చూపించడంతో పగలబడి నవ్వారు.

Advertisement

Next Story