- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పొరేట్ల చేతిలో బ్యాంకులుంటే అంతే : కౌశిక్ బసు
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ బ్యాంకుల్లోకి కార్పొరేట్ సంస్థలను అనుమతించాలని ఆర్‌బీఐ అంతర్గత కమిటీ చేసిన సిఫార్సులపై ప్రపంచబ్యాంకు మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే పెట్టుబడిబారి విధానానికి, అదేవిధంగా ఆర్థిక అస్థిరతకు పరిస్థితులు దారితీస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ ప్రతిపాదన చక్కగా కనిపించే చెడు మార్గమని అభిప్రాయపడ్డారు.
విజయవంతమైన ఆర్థికవ్యవస్థలను పరిశీలిస్తే..పరిశ్రమలు, కార్పొరేషన్‌ల మధ్య స్పష్టమైన విభజనను కలిగి ఉన్నాయన్నారు. అలాగే, బ్యాంకులు, రుణ సంస్థల మధ్య కూడా ఈ విభజన రేఖ కనిపిస్తుందన్నారు. ఆర్‌బీఐ కమిటీ ఇచ్చిన ఈ ప్రతిపాదన ఓ విధంగా ఆర్థికవ్యవస్థను అస్థిరపరుస్తుందని కౌశిక్ బసు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విధానం మొదటిచూపులో మెరుగ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే పారిశ్రామిక సంస్థలు రుణాలు తీసుకోవాలనుకోవడం, బ్యాంకులు రుణ కార్యకలాపాలను వేగవంతం చేయాలనుకోవడమే దీనికి కారణం.
అంతేకాకుండా, బ్యాంకింగ్ రంగం మరింత సమర్థవంతంగా కనిపించేలా చేస్తుందన్నారు. ఈ ప్రతిపాదన క్రోనీ కేపిటలిజానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయడమే కాకుండా అవినీతి పెంచేందుకు దోహదపడుతుందని, మార్కెట్లో గుత్తాధిపత్యం ఏర్పడుతుందని కౌశిక్ బసు హెచ్చరించారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలు, రాజకీయం కుమ్మక్కయ్యే ప్రమాదముందన్నారు. కార్పొరేట్ల చేతిలో బ్యాంకులుంటే సొంత ప్రయోజనాల కోసం డిపాజిటర్ల సొమ్మును వాడుకోవచ్చని, అవసరమైనవారికి రుణాలు అందకపోవచ్చని, దానివల్ల దేశ అభివృద్ధి కుంటుపడే అవకాశాలున్నాయన్నారు.