ఏపీలో రెండు సార్లు సర్వే చేశాం

by  |
ఏపీలో రెండు సార్లు సర్వే చేశాం
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు 1.32 కోట్ల కుటుంబాలను ఆరోగ్యపరంగా రెండు సార్లు చొప్పున సర్వే చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మూడో విడత సర్వే కూడా చేపట్టామని ఆయన వెల్లడించారు. మూడో విడత సర్వేలో 1.46 కోట్ల కుటుంబాల వివరాలు సేకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 12,311 మంది కరోనా అనుమానితులను గుర్తించామని ఆయన ప్రకటించారు. మూడో సారి నిర్వహిస్తున్న సర్వేలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.

Tags: corona tests, ap survey, 3 survey, health survey, katamaneni bhaskar

Advertisement

Next Story

Most Viewed