'RX 100' హీరో పదేళ్ల లవ్ స్టోరీ.. ఫైనల్‌గా ఎంగేజ్‌మెంట్‌!

by Shyam |   ( Updated:2021-08-24 02:14:09.0  )
RX 100 హీరో పదేళ్ల లవ్ స్టోరీ.. ఫైనల్‌గా ఎంగేజ్‌మెంట్‌!
X

దిశ, సినిమా : ‘ఆర్‌ఎక్స్ 100’ మూవీతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ లోహిత రెడ్డితో ఎంగేజ్‌మెంట్ అయినట్టు ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ మేరకు ట్రెడిషన్‌ లుక్ ఫొటోలు షేర్ చేసిన కార్తికేయ.. ‘లైఫ్ పార్టనర్‌ కాబోతున్న నా బెస్ట్ ఫ్రెండ్‌‌తో ఎంగేజ్‌మెంట్ అయిందని ప్రకటించడం ఆనందంగా ఉంది. లోహితను 2010లో NIT వరంగల్‌లో మొదటిసారి కలిశాను. అప్పటి నుంచి మా ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోంది. ఈ బంధం మరెన్నో దశాబ్దాలు కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. ‘హిప్పి, గుణ 369, చావుకబురు చల్లగా, 90 ఎంఎల్’ వంటి చిత్రాల్లో నటించిన కార్తికేయ.. ప్రస్తుతం తెలుగులో ‘రాజా విక్రమార్క’ చిత్రంలో హీరోగా నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ ‘వాలిమై’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.

Advertisement

Next Story