‘ఐ హేటెడ్ మై బాడీ’.. యంగ్ హీరోయిన్

by Shyam |   ( Updated:2023-05-19 09:20:26.0  )
‘ఐ హేటెడ్ మై బాడీ’.. యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా : మలయాళం హీరోయిన్ కార్తీకా మురళీధరన్ సెకండ్ స్టాండర్డ్ నుంచే ఎదుర్కొన్న బాడీ షేమింగ్ కామెంట్స్ తనపై చాలా ప్రభావాన్ని చూపాయని తెలిపింది. చిన్నప్పటి నుంచే చబ్బీగా ఉండే తను కేవలం స్కూల్‌లో మాత్రమే కాదు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా తనను ఎగతాళి చేసేవారని చెప్పింది. బయటకు వెళ్లేందుకు సిగ్గుపడేదాన్నని, తన మీద తనకే అసహ్యం వేసేదని తెలిపింది. లైఫ్‌లో ముందుకు సాగేందుకు డిఫెన్స్ మెకానిజమ్స్ డెవలప్ చేసుకునే క్రమంలో మరింత వెయిట్ గెయినింగ్ స్టార్ట్ అయిందని వివరించింది కార్తీక.

ఇక అన్‌హెల్తీ బ్యూటీ స్టాండర్డ్స్ కలిగిన ఇండస్ట్రీలో చేరాక అంతకు ముందు కన్నా అధికంగా ఫ్యాట్ షేమింగ్, సెక్సువలైజేషన్ తను ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో తనకు బాడీతో కాన్‌స్టాంట్ వార్ జరుగుతుండేదని వివరించింది. కానీ ఈ ప్రక్రియలో చాలా అలసిపోయానని, తనను తనలా యాక్సెప్ట్ చేయమని ప్రపంచాన్ని కన్విన్స్ చేయలేకపోయానని తెలిపింది. తను బాడీని హేట్ చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని, అలా చేయడం మానేయాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఫైనల్‌గా ఫుడ్, బాడీ, మైండ్, బిలీఫ్ సిస్టెమ్స్‌తో తనను తాను ఫిక్స్ చేసుకున్నానని.. బుల్‌షిట్ బ్యూటీ స్టాండర్డ్స్, కామెంట్స్ పట్టించుకోవాలని అనుకోలేదని తెలిపింది. తనకు తానుగా ఇష్టపడే ఆథెంటిక్ వెర్షన్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

ఈ క్రమంలో ఓ ఇనిస్టిట్యూట్‌లో వెయిట్ లాస్ కోసం చేరినా.. ఫుడ్ తీసుకునే విధానం, సెల్ఫ్ రెస్పెక్ట్, నిర్భయత, శక్తి అంటే ఏమిటో తెలిసొచ్చిందని కార్తీక వివరించింది. శరీరానికి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు అది ఉత్పత్తి చేసే శక్తిని ఆపలేమని చెప్పింది. మనం ఇచ్చే ఆహారాన్ని తీసుకునే శరీరం పది రెట్లు శక్తిని ఇస్తుందని గ్రహించానని తెలిపింది. మీ శరీరాన్ని మీరు ప్రేమించాలని సూచించింది.

Advertisement

Next Story