- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో ఘనంగా కార్తీక దీపోత్సవం
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల అలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పర్వ దీపోత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయ్యాక దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం పక్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూలమూర్తికి హారతి ఇచ్చారు. గర్భాలయంలో స్వామి పుష్కరిణి వద్ద నేతి దీపాలను ఉంచారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ప్రతిఏటా తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజున కార్తీకదీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను కార్తీక దీపాల జ్యోతులు హరించి వేయాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్తీక దీపోత్సవం వెలుగుతో భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులు వెలుగుతాయన్నారు. ఈ కార్తీకదీపోత్సవంలో ఈవో కేఎస్జవహర్రెడ్డి, బోర్డు సభ్యులు అనంత, ప్రశాంతిరెడ్డి, మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, శేఖర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాధ్ జెట్టి, తిరుపతి అర్బన్‌ఎస్పీ రమేష్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వీఎస్‌వో బాలిరెడ్డి, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.