ఆ రాష్ట్ర మంత్రికి పాజిటివ్

దిశ, వెబ్ డెస్క్ :దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప కంట్రోల్ కావడం లేదు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చాలా మంది మరణించారు. అందులో కరోనా వారియర్స్‌తో రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నారు. తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్‌లో స్వయంగా ఆయనే వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా, పాజిటివ్‌గా వచ్చిందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

సీఎం బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని అన్ని శాఖలు కొవిడ్-19పై పోరాటం చేశాయని ట్వీట్ చేసిన ఆయన.. ఆ సందర్భంలో తాను 30 జిల్లాల్లో పర్యటించానని.. ఈ సందర్భంలోనే తనకు కరోనా సోకిందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. తనకు ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోవాలని మంత్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. కాగా, సీఎం యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా కరోనా బారిన పడిన విషయం విదితమే.

Advertisement