- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెమెరాకు చిక్కిన.. కెమెరా ఇల్లు
దిశ, వెబ్‌డెస్క్: సగటు మనిషి.. ఓ ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంటాడు. తన డ్రీమ్ హౌజ్‌ను అందుకు తగ్గట్లుగానే తీర్చిదిద్దుకుంటాడు. కర్ణాటకలోని బెల్గామ్‌కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ కూడా తన ఆశల పొదరిల్లును కెమెరా ఆకారంలో కట్టుకుని అందర్నీ ఆకర్షించాడు. కాగా, కెమెరా కంటికి చిక్కిన ‘కెమెరా ఇంటి’ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
రవి హొంగల్.. ఈ పేరు నిన్నటి వరకు మనకు తెలియదు. కానీ అతడు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నాడు. పసితనంలోనే ఈ ప్రపంచాన్ని కెమెరా కన్నులతో చూడటం ప్రారంభించిన రవి.. తన వ్యాపకాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. ఓ వ్యక్తి తన ఇష్టమైన రంగంలో ముందడుగు వేస్తే.. ఫలితం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇష్టపడి చేస్తుండటంతో 100 శాతం మనసు పెట్టి పనిచేస్తాం. ఫలితం కూడా అందుకు అనుగుణంగానే వస్తుంది. రవి విషయంలోనే అదే జరిగింది. ఫొటోగ్రఫీలో పేరుతో పాటు మంచి ఆదాయం కూడా పొందాడు. ఇక, తన కలల సౌధాన్ని.. తనకు జీవితాన్నిచ్చిన కెమెరా రూపంలోనే నిర్మించుకున్నాడు. లెన్స్, కెమెరా రీల్, ఫ్లాష్ లైట్, మెమొరీ కార్డ్.. ఇలా ప్రతీది ఆ ఇంటి ముందుభాగంలో కనిపిస్తాయి. ఇంటి లోపల కూడా కెమెరాను తలపించే.. ఇంటీరియర్‌తో తీర్చిదిద్దారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రవికి ముగ్గురు పిల్లలు. వారి పేర్లు.. ‘నికాన్, కెనాన్, ఎప్సన్’ అని పెట్టుకున్నారు. ఆ పేర్లే ఇంటి ముందు భాగంలోనూ కనిపిస్తాయి.
వీటితో పాటు గోడల పై కప్పులు కూడా కెమెరాలోని వివిధ భాగాలను పోలి ఉండటం నిజంగా అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఇల్లు బాగా వైరల్ అయ్యింది. ఇది కదా రియల్ ప్యాషన్ అంటే.. కళపై ప్రేమ అంటే ఇలా ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.