- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్మశానంలో దీపావళి సెలబ్రేషన్స్..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : శ్మశాన వాటిక పేరు వినగానే పెద్ద, చిన్న అనే తేడా లేకుండా చాలామంది భయపడుతారు. అక్కడికి వెళ్లేందుకు కూడా ఒక్క క్షణం ఆలోచిస్తారు.కానీ, కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రజలకు మాత్రం శ్మశానంలో దీపావళి పండుగ జరుపుకునే ఆనవాయితీ ఉంది. తమ పూర్వీకుల యాదిలో వారి సమాధుల మధ్యే దీవాళిని ప్రతియేడు ఘనంగా నిర్వహించుకుంటారు. తమ ఇళ్లలో టపాసులు కాల్చకుండా పూర్వీకుల సమక్షంలో దీపావళిని జరుపుకోవాలని భావిస్తారు. తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి కుటుంబంలోని ప్రతిఒక్కరూ అక్కడకు చేరుకుని వేడుక చేసుకుంటారు.
వినడానికి కొంత వింతగా అనిపించినా, గత ఆరు దశాబ్దాలుగా కరీంనగర్ కు చెందిన చాలా కుటుంబాలు ఈ తంతును ఆచరిస్తున్నాయి. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని వారు చెబుతున్నారు.అందుకోసమే చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు.
దేశ విదేశాల నుంచి..
కరీంనగర్ కు చెందిన వీరంతా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దీపావళి పండగకు మాత్రం ఖచ్చితంగా జిల్లాకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల పండుగ జరుపుకుంటారు. ఇలాంటి పండుగ దేశంలోనే మరెక్కడా ఉండదనడంలో అతిశయోక్తి లేదు. సమాధులను శుభ్రం చేసి అలంకరించి ముందుగా దీపం వెలిగిస్తారు. అనంతరం పిండి వంటలు సమాధులపై పెట్టి కన్నుల పండుగగా దీవాళిని సెలబ్రేట్ చేసుకుంటారు.
ఆదర్శవంతమైన ఆనవాయితీ..
తమ పూర్వీకులను స్మరించుకునే విధానం ఒక్క కరీంనగర్ లో మాత్రమే ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఇలాంటి వేడుకలు ఎక్కడా కూడా జరగవన్నారు. మరణించిన తమ వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్దే పర్వ దినం నిర్వహించుకోవడం ఆదర్శవంతమైందని బండి తెలిపారు.
-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్