అంతా కేంద్రానిదే.. రాష్ట్రానిది ఏమీలేదు : బండి సంజయ్

by Sridhar Babu |
అంతా కేంద్రానిదే.. రాష్ట్రానిది ఏమీలేదు : బండి సంజయ్
X

దిశ, కరీంనగర్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే కరోనా కట్టడికి చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. బుధవారం కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటివరకు తెలంగాణకు రూ. 7,151 కోట్లను కేంద్రం కరోనా నివారణ కోసం విడుదల చేసిందన్నారు. ఈ నిధులతోనే రాష్ట్రంలో 7 లక్షల 44 వేల ఎన్ 95 మాస్కులు, 3 లక్షల 41 వేల పీపీఈ కిట్లు, 22 లక్షల 50 వేల హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్టెట్లు, మూడు లక్షల 82 వేల పరీక్షా పరికరాలు అందించినట్లు బండి వెల్లడించారు.
కరీంనగర్ జిల్లాలో డివిజన్లు, గ్రామాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను హెల్త్ బులిటెన్‌లో తెలయపరచాలని డిమాండ్ చేశారు.టెస్టుల సంఖ్య కూడా పెంచాలని, జిల్లాలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలను కరోనాకు చికిత్స అందించేందుకు సిద్దం చేయాలన్నారు. శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో సౌకర్యాలు మెరుగుపరచాలని, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారిని గుర్తించి వైద్య సేవలు అందించాలని కోరారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి కేంద్రం అందించిన 24 వెంటిలేటర్లు, బెడ్లు అందజేసినట్లు బండి సంజయ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed