- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వేలు చూసి కేసీఆర్‌కు మైండ్ బ్లాక్ అయింది
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదని వెల్లడించారు. సర్వేలు చూసి కేసీఆర్‌కు మైండ్ బ్లాక్ అయిందని, అందుకే ప్లీజ్ ఓటు వేయండని ప్రజలను అడుక్కుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.
హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ప్రజలను పట్టించుకునేందుకు కేసీఆర్ బయటకు రాడు కానీ, ప్రధాని మోడీ రావాలంటాడు. వరద బాధితులకు భరోసా ఇచ్చేందుకు జాతీయ లీడర్లు హైదరాబాద్‌కు వస్తున్నారని బండి వివరించారు. బహిరంగ సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ పై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. కార్పొరేట్ ఆస్పత్రులతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని కరీంనగర్ ఎంపీ ఆరోపించారు. అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదన్నారు.