- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎమ్మెల్యేలకు సీఎం… ఆ లైసెన్స్ ఇచ్చారు’
దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని, టీఆర్ఎస్ నేతలు దోపిడీకి, కబ్జాలకు తెగబడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దోచుకోవాలని లైసెన్స్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కబ్జాల వల్లే ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ నగరం మునిగిపోయిందన్నారు. మహబూబాబాద్, నర్సంపేటతో పాటు పలు జిల్లాల్లో కబ్జాల పర్వం కొనసాగుతోందన్నారు. హరితహారం పేరుతో రైతుల భూములను ప్రభుత్వమే కబ్జా చేస్తోందన్నారు. నర్సంపేటలో కోట్లాది రూపాలయ విలువైన భూములను స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేశారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నచ్చని వారి భూముల్లో హరితహారం పేరుతో చెట్లను నాటుతున్నారని విమర్శించారు.