- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో దొరికిన కరీంనగర్ ఫేక్ కరెన్సీ ముఠా..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీసులు శనివారం ఫేక్ కరెన్స్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. వీరంతా కరీంనగర్‌కు చెందిన వారు కావడంతో ఇక్కడ కూడా ఇలాంటి దందాలకు పాల్పడ్డారేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కీసర పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కరీంనగర్‌లోని కార్ఖానగడ్డకు చెందిన ఎండీ అజీజ్ అలియాస్ ఆజం (35), పెద్దపల్లి జిల్లా రంగంపల్లికి చెందిన ఎండీ అన్వర్ పాషా (38), కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా ప్రాంతానికి చెందిన జంగం భాగ్యలక్ష్మీ (40)లు అరెస్ట్ అయ్యారు. వీరితో పాటు జిల్లాకు చెందిన లాడ్జి యజమాని రవీందర్ సింగ్ అతను పంపించిన రాజేశ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.
బాధితుడూ ఇక్కడే…
ఈ కేసులో బాధితుడు ఎన్ రాజిరెడ్డి కూడా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన వారే కావడం గమనార్హం. రాజిరెడ్డిని కొంతకాలంగా అబ్జర్వ్ చేసిన ఈ ముఠా ట్రాప్‌లో పడేసి ఉంటుందని భావిస్తున్నారు. బాధితుడు రాజిరెడ్డికి మొదట కాల్ చేసిన నిందితురాలు భాగ్యలక్ష్మీ కరీంనగర్ వాసే కావడం విశేషం. ఓ ప్రయివేటు ఆస్పత్రి నర్సుగా పనిచేస్తున్న ఆమె రాజిరెడ్డిని ముందుగానే గుర్తించి ఈ దుస్సహాసానికి ఒడిగట్టి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
బాధితులు ఉన్నారా..?
కీసర పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలో ఎక్కువ మంది కరీంనగర్ వాసులే ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన వారిని కూడా ఇదే పద్ధతిలో మోసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తే మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.