బిడ్డ పుట్టిన నెలకే.. షూటింగ్‌లో కరీన

by Jakkula Samataha |
బిడ్డ పుట్టిన నెలకే.. షూటింగ్‌లో కరీన
X

దిశ, సినిమా : బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, బిడ్డ పుట్టిన నెల రోజుల తర్వాత కరీనా ఈ రోజు(సోమవారం) ముంబైలోని బాంద్రాలో ఓ సినిమా షూటింగ్‌కు హాజరైంది. తన టీమ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కరీనా, కారు దిగి వెళ్తున్న సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కరీనా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’తో పాటు బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ‘సీత – ది ఇన్‌కర్నేషన్’లో ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది.

Advertisement

Next Story