ఆ ముగ్గురిని మిస్ అవుతున్న కరీనా

by Shyam |
ఆ ముగ్గురిని మిస్ అవుతున్న కరీనా
X

కరీనా కపూర్ ఖాన్… బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రేస్. సైఫ్ అలీ ఖాన్ న్ పెళ్లి చేసుకుని… తైమూర్ అలీఖాన్ కు జన్మనిచ్చినా సరే… సోదరి కరిష్మా, స్నేహితులు మలైకా అరోరా, అమృత అరోరాలతో తరుచూ కలుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ వాళ్ల గురించి గొప్పగా చెప్పుకునే కరీనా… లాక్ డౌన్ కారణంగా వారిని కలవలేక పోతున్నందుకు ఫీల్ అవుతోంది. ముగ్గురిని మిస్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టింది.

నలుగురం ఓకే టేబుల్ కు డిన్నర్ కు వెళ్ళేవాళ్ళం అని… ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో టేబుల్ లో కూర్చుని భోజనం చేయాల్సి వస్తోంది అంటోంది. వాళ్లకు దూరంగా ఉండలేక పోతున్నాను అని పోస్ట్ పెట్టింది.

కాగా కరీనా చివరగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజి మీడియంలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా మూవీలో అమీర్ ఖాన్ సరసన నటిస్తోంది. మరిన్ని ప్రాజెక్టులకు అగ్రిమెంట్ చేసే పనిలో ఉంది కరీనా.

Tags : Kareena Kapoor, Karishma Kapoor, Malaika Arora, Bollywood

Advertisement

Next Story