కరీనా @40.. స్పెషల్ పోస్ట్

by Shyam |   ( Updated:2020-09-20 09:00:56.0  )
కరీనా @40.. స్పెషల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కరీనా కపూర్ ఖాన్ గురించి ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు .. తానో గొప్ప నటి అని.. పర్ఫెక్షన్ ఉన్న హీరోయిన్ అని.. జీరో సైజ్ కు కేరాఫ్ అడ్రస్ అని.. వీటికి తోడు మంచి కూతురు, గొప్ప తల్లి, బెస్ట్ వైఫ్ కూడా. 40 ఏళ్ల వయసుకు చేరుకున్న బ్యూటీ అందరికీ, అన్నిటికీ థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ పెట్టింది.

40 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తనను తాను ప్రశ్నించుకుని మరింత ప్రతిబింబించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తన లైఫ్ లో చాలా ప్రేమను పంచాను, నవ్వించాను, క్షమించాను అని తెలిపిన బెబో.. తనకు ఇంతటి బలంగా తీర్చిదిద్దిన గొప్ప శక్తికి కృతజ్ఞతలు చెప్పింది. తనను బలమైన స్త్రీగా తీర్చిదిద్దిన అనుభవాలు, నిర్ణయాలకు ధన్యవాదాలు తెలిపింది. తప్పు ఒప్పులు, గ్రేట్ అండ్ సో సో కాంబినేషన్ లో ఉన్న బిగ్ 40 మరింత పెద్దగా అవ్వాలని కోరుకుంది.

కాగా సెప్టెంబర్ 21న 40 వ పుట్టినరోజు జరుపుకుంటున్న కరీనాకు విష్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. హే బెబో అసలు 40 ఏళ్లు అంటే నమ్మలేక పోతున్నామని చెప్తున్నారు. మొన్ననే 30 వ బర్త్ డే జరిగినట్లు ఉందని.. కాలం చాలా స్పీడ్ గా పరుగెడుతుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed