కరీనా ఫొటోషూట్ బై సైఫ్..

by Jakkula Samataha |
కరీనా ఫొటోషూట్ బై సైఫ్..
X

కరీనా కపూర్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా కానివారుండరు. సినిమా సినిమాకీ ప్రేక్షకులకు సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చే సత్తా కరీనా సొంతం. ఆ యాక్టింగ్.. ఆ బ్యూటీనెస్.. జీరో సైజ్ పర్సనాలిటీ.. ఆ పదునైన కంటి చూపునకు ఎవరైనా వావ్ అనాల్సిందే. 2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ సినిమాతో బాలీవుడ్ కెరియర్ మొదలు పెట్టిన కరీనా.. 2020లో చేసిన ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాలో సూపర్ స్టన్నింగ్, బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘పో, కభీ ఖుషి కభీ గమ్, జబ్ వీ మెట్, చమేలి, గీత్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన కరీనా ఇండస్ట్రీకొచ్చి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా సరే, తనకున్న క్రేజ్.. తనలో ఉన్న గ్రేస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ఈ సందర్భంగా కరీనా సినీ ప్రయాణం గురించి తెలుపుతూ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్.. కవర్ పేజీ షూట్ కోసం ట్రై చేసింది. కానీ కరోనా కారణంగా కరీనా ఫోటో షూట్ చేసే వీలు లేకపోవడంతో.. తన హస్బెండ్ సైఫ్ అలీ ఖాన్ స్వయంగా ఈ ఫొటో షూట్ చేశాడు. ఇందుకు థాంక్స్ చెప్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది కరీనా. ఈ ఫొటో షూట్ కోసం తన షర్ట్స్ ఇచ్చిన సైఫ్‌కు థాంక్స్ చెప్పిన బెబో.. సైఫ్ ఫొటోగ్రఫీ స్కిల్స్‌ను ప్రశంసించింది. ఇంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన ఫిల్మ్ ఫేర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

https://www.instagram.com/p/CDwKZWUpFVB/?igshid=87fs02ceg46n

ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు గార్జియస్ బెబో అందానికి ఖుదోస్ చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ లాంటి హస్బెండ్ ఉండాలని కోరుకుంటున్నారు లేడీ ఫ్యాన్స్.

Advertisement

Next Story