- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో బిడ్డను పరిచయం చేసిన కరీనా కపూర్
దిశ, సినిమా: బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ ఫస్ట్ కొడుకు తైమూర్ అలీఖాన్‌కు ఇంటర్నెట్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇక రీసెంట్‌గా రెండో బిడ్డకు వెల్‌కమ్ చెప్పిన భామ.. ఇప్పటి వరకు ఒక్క ఫుల్‌ఫొటో కూడా షేర్ చేయలేదు. కానీ రెండుసార్లు తన ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎదుర్కొన్న ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటూ ఓ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు బెడ్‌కే పరిమితం అవుతారు కానీ తను షూటింగ్స్‌కు కూడా హాజరయ్యానని.. ఆ సమయంలో తను ఎలా ఫీల్ అయ్యాననే విషయాన్ని ఇందులో వివరించానని చెప్పింది. ‘కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో వస్తున్న పుస్తకాన్ని జగర్నాట్ బుక్స్ పబ్లిష్ చేస్తుండగా.. రీసెంట్‌గా ఇందుకు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేసింది. ఇప్పటి నుంచే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఈ బుక్‌ను తన మూడో బిడ్డగా అభివర్ణించిన కరీనా.. FOGSI చేత అప్రూవ్ చేయబడినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది.